నిజంగా చెప్పుకోవాలి అంటే… SEOకి కొత్తగా వచ్చినప్పుడు “keyword research” అన్న మాట భయపెట్టేలా ఉంటుంది. కానీ మీరు దాంట్లోకి involve అయినాక, ఇది నిజానికి simple – people ఏమి search చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి మీరు ఎలా help చేయగలరు అన్నదే.
ఈ guide లో నేను keyword research ని మీకు అసలు అర్ధం అయ్యేలా explain చేస్తాను. Just simple and useful tips.
Keyword Research అంటే నిజంగా ఏమిటి?
Keyword research అంటే, మీ ideal audience Google లో ఏమి type చేస్తారు అనేదిని గుర్తించడం. ఇవి అర్ధం లేని words కాదు – ఇవే వాళ్ళ మనసులో ఏముంది అన్నదాని entrance.
ఉదాహరణకి, మీరు Vizag లో washing machines repair చేస్తుంటే, “Best washing machine” కంటే “Washing machine repair in Vizag” మీకు actual customers తెస్తుంది. ఇదే Keyword research – మీరు ఇచ్చే service కి match అయ్యే, జనాలు నిజంగా వెతుకుతున్న words ని కనుగొనడం.
Step-by-Step: A Beginner’s Roadmap
Step 1: మీ Services ని Clarity తో అర్థం చేసుకోండి
ఎలాంటి keyword tool open చేయకముందు, ఈ ప్రశ్నలు మీరే మీకు వేయండి:
- నేను ఏమి provide చేస్తున్నాను?
- ఎవరి కోసం పని చేయాలనుకుంటున్నాను?
- Customers repeated గా ఏమి అడుగుతున్నారు?
ఉదాహరణకి, ఒక local service business లో ఉండే keywords ఇలా ఉండొచ్చు:
- AC gas refilling
- Refrigerator not cooling
- Microwave button not working
ఇవి problems కాదు – ఇవే keyword ideas కి starting points.
Step 2: Google ని ఉపయోగించి జనం ఏమి వెతుకుతున్నారో తెలుసుకోండి
Expensive tools అవసరం లేదు. ఈ free tools try చేయండి:
- Google Autocomplete – type చేయండి, suggestions observe చేయండి
- People Also Ask – actual questions
- Google Trends – seasonal demand identify చేయడానికి
- AnswerThePublic – how/why/what type questions కి useful
“AC not working” type చేస్తే, మీరు suggestions చూడవచ్చు:
- AC not cooling correctly
- AC repair price
- Best AC fix near me
ఇవి random data కాదు – ఇవే మీ real customers search చేస్తున్నవి.
Step 3: Search Intent అర్థం చేసుకోవడం (చాలా Crucial)
చాలామంది beginners ఇక్కడే miss అవుతారు. Keyword దొరికిన వెంటనే దాన్ని repeat చేస్తారు. కానీ question: వాళ్ళు అది ఎందుకు వెతుకుతున్నారు?
3 main types of search intent:
- Informational: “Why is my fridge leaking water?”
- Transactional: “Samsung fridge repair Vizag”
- Navigational: “LG service center Vizag”
మీ goal calls లేదా bookings అయితే, transactional మరియు local intent keywords ని priority ఇవ్వండి.
Step 4: వాస్తవంగా జనం వెతుకుతున్నారా చూడండి
ఈ free/freemium tools ఉపయోగించండి:
- Google Keyword Planner
- Ubersuggest
- Keyword Surfer (Chrome Extension)
Keywords చూసేటప్పుడు ఇవి check చేయండి:
- Search Volume: monthly searches ఉన్నాయా?
- SEO Difficulty: small business site realistically rank అవుతుందా?
“Samsung AC gas refill Vizag” కి 50 searches ఉన్నా, అది buyer intent keyword అయితే, అది 50 real chances.
Step 5: Keywords ని Groups లో Organize చేయండి (Keyword Clusters)
Each keywordకి ఒక page కాకుండా, similar keywords ని cluster గా treat చేయండి:
AC Repair Cluster:
- AC repair near me
- Emergency AC repair Vizag
- AC not cooling properly
Fridge Repair Cluster:
- Refrigerator not cooling
- Samsung fridge repair Vizag
- Fridge gas refill service
ప్రతి clusterకి ఒక dedicated blog post లేదా service page ఉండాలి. Focus చేయండి, Useful గా ఉంచండి.
Common Mistakes Avoid చేయండి
- High-volume keywords వెనకాలే పరిగెత్తకండి – relevance & intent చాలా ముఖ్యం
- Competitor keywords ని blindly copy చేయకండి – వాళ్ళ audience మీ వాళ్ళు కాకపోవచ్చు.
- Keyword stuffing చేయకండి – ఇది outdated మరియు spammy గా కనిపిస్తుంది
బదులుగా, search చేసే వ్యక్తి గురించి ఆలోచించండి – వాళ్ళకి ఎలా quick & simple help చేయవచ్చు?
Keywords ఎలా Use చేయాలి?
Keyword ని select చేయడం first step మాత్రమే. కానీ వాటిని తెలివిగా Use చేయాలి:
• Main keyword – title, first paragraph, URL లో పెట్టండి
• Related phrases – subheadings & content లో naturally పెట్టండి
• FAQ section – common doubts కి answers ఇవ్వండి
• Internal linking – similar services/articles కి connect చేయండి
Note: One page = One topic. ఒకే page లో multiple services లేదా unrelated keywords avoid చేయండి.
Keyword Research Continuous Process
ఎప్పటికప్పుడు Search behavior మారుతుంది. Competitors active అవుతారు. మీ services evolve అవుతాయి. So, keyword research is not one-time job.
- Rankings check చేస్తూ ఉండండి.
- Google Search Console లో కొత్త search terms చూడండి.
- Content update చేయండి (ప్రతి కొన్ని నెలలకు)
Even small updates = big improvements over time.
ఇంతవరకు చదివితే, మీరు already beginners కన్నా ahead లో ఉన్నారు. Keyword research technical అయి ఉండాల్సిన పనిలేదు. ఇది people ని అర్థం చేసుకుని, మీ content వాళ్ళ needs కి match చేయడం.
- వాళ్ళ problems తో start చేయండి
- మీరు use చేస్తున్న free toolsతో work చేయండి
- “Everywhere” rank అవ్వాలని ప్రయత్నించకండి – “– మీకు అవసరమైన చోట rank కావాలని ప్రయత్నించండి.
ఇది పాటిస్తే, మీకు నిజంగా ఉపయోగపడే SEO ఫలితాలు వస్తాయి – అర్థం లేని ట్రాఫిక్ కాదు, మీ సేవలు లేదా ఉత్పత్తులు కావాలనుకునే targeted visitors రావడం ద్వారా నిజమైన బిజినెస్ ఏర్పడుతుంది.